6, జనవరి 2023, శుక్రవారం

కొలెస్ట్రాల్

 కొలెస్ట్రాల్ 

కొలెస్ట్రాల్ అంటే?

మన శరీరంలోని కణాలన్నింటిలో కనిపించే మైనపు కొవ్వు లాంటి పదార్థం.హార్మోన్లు విటమిన్ డి, ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడే పదార్థాలను తయారు చేయడానికి కొంత అవసరం. మన శరీరం కొంత కొలెస్ట్రాల్ ని తయారు చేస్తుంది, అలాగే కొంత ఆహారం నుండి వస్తుంది. గ్రుడ్డు సోనా, మాంసం, పాల పదార్థాలు, నూనె పదార్థాల నుండి వచ్చే ఆహారం లో కూడా కొలెస్ట్రాల్ ఉంటుంది. 

రక్తంలో అధికంగా కొలెస్ట్రాల్ ఉంటే అది ఫలకాలను తయారు చేస్తుంది. ధమనుల గోడలకు ఈ ఫలకాలు అంటుకొని రక్త ప్రవాహాన్ని అడ్డుకునేలా చేస్తాయి. ఈ ఫలకం ఏర్పడే విధానాన్ని అథెరోస్క్లేరోసిస్ అంటారు. ఇది కరొనరీ ఆర్టొరి వ్యాధి కలిగిస్తుంది. ఇది కరొనరీ ధమనులు ఇరుకుగా మారుతాయి.

HDL,LDL మరియు VLDL అంటే ఏమిటి?

ఇవి లిపోప్రోటీనులు. ఇవి కొవ్వు (లిపిడ్) మరియు ప్రోటీనుల కలయిక. వివిధ రకాల లిపోప్రొటీనులు వేర్వేరు ప్రయోజనాలను కలిగి ఉంటాయి.

  • HDL అంటే అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటీనులు. దీనిని ."మంచి కొలెస్ట్రాల్" అని కూడా అంటారు. ఇది మన శరీర బాగాల నుండి  నుండి కొలెస్ట్రాల్ ని కాలెయానికి తీసుకెళ్తుంది. ఈ కాలేయం కొలెస్ట్రాల్ ని శరీరం నుండి తీసివేయబడుతుంది.
  • LDL అంటే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీనులు. ."చెడు కొలెస్ట్రాల్" అని కూడా అంటారు. ఇది అధికంగా ఉంటే ధమనులలో ఫలకాలు ఏర్పడతాయి.
  • VLDL అంటే చాలా తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రోటీనులు. దీనిని కూడా "చెడు కొలెస్ట్రాల్" అంటారు. ఇది కూడా LDL వలె అధికంగా ఉంటే ధమనులలో ఫలకాలు ఏర్పరుస్తుంది. కానీ VLDL మరియు LDL ఒకటి కాదు, ఇవి భిన్నమైనవి. VLDL ప్రధానంగా ట్రైగ్లిసరైడ్ ను కలిగి వుంటుంది, LDL ప్రదానంగా కొలెస్ట్రాల్ ని కలిగి ఉంటుంది.

అధిక కొలెస్ట్రాల్ కి కారణాలు?

కొలెస్ట్రాల్ అధికమైతే దానిని  "హైపర్కోలేస్టోరోలేమియా" లేదా "హైపర్లిపిడెమియా" లేదా "హైపర్లిపోప్రొటెనెమియా" అంటారు.
అధిక కొలెస్ట్రాల్ కి ముఖ్యకారణం జీవన శైలి.
  • చెడు కొవ్వు పధార్థాలు ఎక్కువ తినడం, అనారోగ్యపు ఆహార అలవాట్లు. మాంసం, పాల ఉత్పత్తులు, చాక్లెట్లు, నూనెలో కాల్చిన పదార్థాలు, డీప్ ఫ్రైడ్ మరియు ప్రాసెస్ చేసిన పదార్థాలలో ఎక్కువగా ఉంటుంది. వీటి ద్వారా LDL పెరుగుతుంది 
  • శారీరక శ్రమ లేకపోవడం, ఎక్కువ కూర్చోవడం, మరియు తక్కువ వ్యాయామం వీటి ద్వారా HDL తగ్గుతుంది.
  • దుమపానం HDL తగ్గించి LDL పెంచుతుంది.
  • జనటిక్ సమస్యల ద్వారా కలగవచ్చు.  వారసత్వం ద్వారా కొలెస్ట్రాల్ పెరగచ్చు.

అధికంగా ఉంటే ఆరోగ్య సమస్యలు?
  • వయస్సు: మీరు పెద్దయ్యాక మీ కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి. ఇది తక్కువ సాధారణం అయినప్పటికీ, పిల్లలు మరియు యుక్తవయస్కులతో సహా యువకులు కూడా అధిక కొలెస్ట్రాల్‌ను కలిగి ఉంటారు.
  • సెక్స్: 20 మరియు 39 సంవత్సరాల మధ్య, స్త్రీల కంటే పురుషులకు అధిక మొత్తం కొలెస్ట్రాల్ వచ్చే ప్రమాదం ఉంది. కానీ రుతువిరతి తర్వాత, స్త్రీకి ప్రమాదం పెరుగుతుంది. రుతువిరతి అధిక రక్త కొలెస్ట్రాల్ నుండి రక్షించే స్త్రీ హార్మోన్ల స్థాయిలను తగ్గిస్తుంది కాబట్టి ఇది జరుగుతుంది.
  • కుటుంబ చరిత్ర: అధిక రక్త కొలెస్ట్రాల్ కుటుంబాలలో నడుస్తుంది.
ఇతర ఆరోగ్య పరిస్థితులు. మధుమేహం, దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి, HIV మరియు లూపస్ వంటి పరిస్థితులు మీ అధిక కొలెస్ట్రాల్ ప్రమాదాన్ని పెంచుతాయి.
మందులు. కొన్ని మందులు మీ LDL కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతాయి లేదా HDL కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించగలవు, వీటిలో:
  1. స్టెరాయిడ్స్
  2. కొన్ని కీమోథెరపీ మందులు
  3. అవయవ మార్పిడి తర్వాత తీసుకున్న మందులు
  4. కొన్ని గుండె పరిస్థితులకు మందులు
  5. బరువు. అధిక బరువు లేదా ఊబకాయం కలిగి ఉండటం వలన మీ కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.
అధిక కొలెస్ట్రాల్ ఏ ఇతర ఆరోగ్య సమస్యలకు కారణం కావచ్చు?
రోగనిర్ధారణ చేయని లేదా చికిత్స చేయని అధిక రక్త కొలెస్ట్రాల్ తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది:

మీరు మీ ధమనులలో ఫలకం యొక్క పెద్ద నిల్వలను కలిగి ఉంటే, ఫలకం యొక్క ప్రాంతం చీలిపోతుంది (బ్రేక్ ఓపెన్). ఇది ఫలకం యొక్క ఉపరితలంపై రక్తం గడ్డకట్టడానికి కారణమవుతుంది. గడ్డకట్టడం తగినంత పెద్దదైతే, అది కరోనరీ ఆర్టరీలో రక్త ప్రవాహాన్ని ఎక్కువగా లేదా పూర్తిగా నిరోధించవచ్చు.
మీ గుండె కండరాలకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తం యొక్క ప్రవాహం తగ్గిపోయినట్లయితే లేదా నిరోధించబడినట్లయితే, అది ఆంజినా (ఛాతీ నొప్పి) లేదా గుండెపోటుకు కారణమవుతుంది.
మీ మెదడు మరియు అవయవాలకు ఆక్సిజన్ అధికంగా ఉండే రక్తాన్ని తీసుకువచ్చే ధమనులతో సహా మీ శరీరంలోని ఇతర ధమనులలో కూడా ఫలకం ఏర్పడుతుంది. ఇది కరోటిడ్ ఆర్టరీ డిసీజ్, స్ట్రోక్ మరియు పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ వంటి సమస్యలకు దారి తీస్తుంది.


3, జనవరి 2023, మంగళవారం

మధుమేహం


మధుమేహం అంటే?

ఇన్స్యూలిన్ హార్మోన్ స్థాయి తగ్గినప్పుడు వచ్చే నియంత్రణ లేని మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ ఉండే వ్యాధి.

లక్షణాలు ఏంటి?

  • అతిమూత్రం (పాలియూరియా) 
  • అతిదాహం (పాలిడిప్సియ)
  • అతిఆకలి 
  • చూపు తగ్గడం 
  • అకారణంగా బరువు తగ్గడం 
  • బద్ధకం
  • గాయాలు మెల్లగా తగ్గడం  
దీనిని ఇంకా ఏమైనా వేరే పేర్లతో పిలుస్తారా?

అవును అవి:

  • చక్కెర వ్యాధి  
  • షుగర్ వ్యాధి
  • అతిమూత్ర వ్యాధి  
  • డయబెటిస్ వ్యాధి 

దీనిలో రకాలు వుంటాయా?
అవును అవి:
  • డయబెటిస్ మెల్లిటస్ టైప్-1
  • డయబెటిస్ మెల్లిటస్ టైప్-2
  • గర్భధారణ (జెస్టేషనల్) మధుమేహం
ఏది ఎలా వస్తుంది?
1.డయబెటిస్ మెల్లిటస్ టైప్-1:
            మన రోగ నిరోధక వ్యవస్థ ఇన్స్యూలిన్ని ఉత్పత్తి చేసే ప్యాంక్రియస్ లోని ఐలెట్స్ ఆఫ్ లంగర్ హాన్స్ లో బీటా కణాలపై పొరపాటున దాడిచేసి నాశనం చేస్తుంది. దీని ద్వారా ఇన్స్యూలిన్ కొరత ఏర్పడుతుంది. వంశపారంపర్యంగా వస్తుంది 

2.డయబెటిస్ మెల్లిటస్ టైప్-2
             మన శరీరం ఇన్స్యూలిన్ ని సమర్ధవంతంగా ఉపయోగించదు. దీని ద్వారా ఇన్స్యూలిన్ అధికమొత్తంలో ఉత్పత్తి అవుతుంది. టైప్-1 వంశపారంపర్యం కాబట్టి ప్రాక్లియాన్లు ఇన్స్యూలిన్ ఉత్పత్తి చేయవు.కానీ ఇక్కడ ప్రాక్లియన్లు ఇన్స్యూలిన్ని ఉత్పత్తి చేస్తాయి కానీ రక్తంలోని గ్లూకోస్ను సమానంగా  ఉంచేందుకు తీసుకెళ్లే నాళాలు సరిగ్గా పనిచేయవు. దీని ద్వారా  హెచ్చుతగ్గులు జరుగుతాయి.    
ఇది రావడానికి ఖచ్చితమైన కారణాలు తెలియవు కానీ కొంతవరకు ఇవి కారణాలుగా చెప్పవచ్చు .
  • జన్యుశాస్త్రం 
  • జీవనశైలి 
  • ఊబకాయము 
3.గర్భధారణ మదుమేహం:
           స్త్రీ లకు గర్భధారణ సమయంలో ఉత్పత్తి అయ్యే ఇన్స్యూలిన్ నిరోధక హార్మోన్ల వల్ల వస్తుంది. గర్భాధారణ సమయంలోనే కనిపిస్తుంది. కొందరిలో టైప్-2 గా మార్పుచెంది అలాగే వుండే అవకాశం ఉంది.

మధుమేహం ఉంటే సమస్యలు ఏమిటి?
సమయం గడిచే కొద్ది సమస్యలు పెరుగుతాయి. రక్తంలో గ్లూకోస్ స్థాయిని సమానంగా ఉంచుకోకపోవడం వల్ల వచ్చే తీవ్ర పరిణామాలు:
  • రక్తనాళ వ్యాధి వల్ల గుండెపోటు, స్ట్రోక్ కి దారితీస్తుంది.
  • కంటి సమస్యలు
  • చర్మ సమస్యలు 
  • నరాల వ్యాధి 
  • మూత్ర పిండాల సమస్యలు 
జాగ్రతలు ఏమిటి?
  • ప్రతి రోజు 45 నిమిషాల వ్యాయామం
  • బరువు సమతుల్యం
  • మాత్రలు సమయానికి క్రమం తప్పకుండ వాడటం
  • ప్రతిరోజూ నిర్ణీత సమయానికి భోజనం చేయడం 
  • మడుమేహంలో కాళ్ళ పదాల స్పర్శ కోల్పోయే అవకాశాలు ఎక్కువ, కాబట్టి ప్రతి సంవత్సరం పాదాల స్పర్శ ఎలా ఉందో చూసుకోవాలి. 
  • పాదాలకు, కాళ్ళకు చర్మం కందిపోవడం కానీ ,గాయాలు కానీ, ఆనెలు కానీ అయినప్పుడు కచ్చితంగా డాక్టర్ ని సంప్రదించి వైధ్యం చేసుకోవాలి. సొంత వైద్యం జోలికి మాత్రం పోరాదు.
  • శరీరానికి ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోండి.
  • అధిక రక్తపోటు, కిడ్నీ, కొలెస్ట్రాల్, కళ్ళు పరీక్షలు డాక్టర్ సలహా మెరకు అప్పుడప్పుడు చేసుకోవాలి.
  • మధుమేహం ఉన్నవారికి కిడ్నీ సమస్యలు అధికంగా ఉంటాయి. మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఎక్కువ. కాబట్టి ప్రతీ మూడు మాసాలకు, ఆరు మాసాలకి మూత్ర పరీక్ష చేసుకొని మూత్రంలో అల్బుమిన్ అనే ప్రోటీన్ విడుదల అవుతుందేమో అని చూసుకోవాలి.
  • మధుమేహం ఉన్నవారికి కరొనరీ రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. ఈ‌ నాళాలు గుండెకు రక్తాన్ని తీసుకెళ్తాయి.ఇవి మూసుకుపోవడం ద్వారా గుండె నొప్పి వస్తుంది. కాబట్టి గుండె నొప్పి వున్నా లేకున్నా ప్రతీ సంవత్సరం ఈ‌సి‌జి, ట్రెడ్మిల్ పరీక్షలు చేసుకోవాలి. అలాగే కొలెస్ట్రాల్ ఎలా ఉందో తెలుసుకునే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేసుకోవాలి.
  • ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచుపదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు తీసుకోవాలి. ముఖ్యంగా జామపండు.                         చేయకూడనివి?    
  • తీపి పదార్థాలు మానుకోవాలి, నూనె పదార్థాలు తగ్గించాలి.
  • పాదరక్షలు లేకుండా నడవకూడదు.
  • పొగ తాగడం, మద్యం సేవించడం మానుకోవాలి.
  • మానసిక ఒత్తిళ్ళు తగ్గించుకోవాలి.
  • కొలెస్ట్రాల్ అధికంగా ఉండే కొవ్వు ఉన్న మాంసం, గ్రుడ్లు తినకూడదు.
  • జీవన శైలిని మార్చుకోవాలి.
                                                                                                                                         ☺☺☺