మధుమేహం అంటే?
ఇన్స్యూలిన్ హార్మోన్ స్థాయి తగ్గినప్పుడు వచ్చే నియంత్రణ లేని మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ ఉండే వ్యాధి.
లక్షణాలు ఏంటి?
- అతిమూత్రం (పాలియూరియా)
- అతిదాహం (పాలిడిప్సియ)
- అతిఆకలి
- చూపు తగ్గడం
- అకారణంగా బరువు తగ్గడం
- బద్ధకం
- గాయాలు మెల్లగా తగ్గడం
అవును అవి:
- చక్కెర వ్యాధి
- షుగర్ వ్యాధి
- అతిమూత్ర వ్యాధి
- డయబెటిస్ వ్యాధి
దీనిలో రకాలు వుంటాయా?
అవును అవి:
- డయబెటిస్ మెల్లిటస్ టైప్-1
- డయబెటిస్ మెల్లిటస్ టైప్-2
- గర్భధారణ (జెస్టేషనల్) మధుమేహం
1.డయబెటిస్ మెల్లిటస్ టైప్-1:
మన రోగ నిరోధక వ్యవస్థ ఇన్స్యూలిన్ని ఉత్పత్తి చేసే ప్యాంక్రియస్ లోని ఐలెట్స్ ఆఫ్ లంగర్ హాన్స్ లో బీటా కణాలపై పొరపాటున దాడిచేసి నాశనం చేస్తుంది. దీని ద్వారా ఇన్స్యూలిన్ కొరత ఏర్పడుతుంది. వంశపారంపర్యంగా వస్తుంది
2.డయబెటిస్ మెల్లిటస్ టైప్-2
మన శరీరం ఇన్స్యూలిన్ ని సమర్ధవంతంగా ఉపయోగించదు. దీని ద్వారా ఇన్స్యూలిన్ అధికమొత్తంలో ఉత్పత్తి అవుతుంది. టైప్-1 వంశపారంపర్యం కాబట్టి ప్రాక్లియాన్లు ఇన్స్యూలిన్ ఉత్పత్తి చేయవు.కానీ ఇక్కడ ప్రాక్లియన్లు ఇన్స్యూలిన్ని ఉత్పత్తి చేస్తాయి కానీ రక్తంలోని గ్లూకోస్ను సమానంగా ఉంచేందుకు తీసుకెళ్లే నాళాలు సరిగ్గా పనిచేయవు. దీని ద్వారా హెచ్చుతగ్గులు జరుగుతాయి.
ఇది రావడానికి ఖచ్చితమైన కారణాలు తెలియవు కానీ కొంతవరకు ఇవి కారణాలుగా చెప్పవచ్చు .
- జన్యుశాస్త్రం
- జీవనశైలి
- ఊబకాయము
3.గర్భధారణ మదుమేహం:
స్త్రీ లకు గర్భధారణ సమయంలో ఉత్పత్తి అయ్యే ఇన్స్యూలిన్ నిరోధక హార్మోన్ల వల్ల వస్తుంది. గర్భాధారణ సమయంలోనే కనిపిస్తుంది. కొందరిలో టైప్-2 గా మార్పుచెంది అలాగే వుండే అవకాశం ఉంది.
సమయం గడిచే కొద్ది సమస్యలు పెరుగుతాయి. రక్తంలో గ్లూకోస్ స్థాయిని సమానంగా ఉంచుకోకపోవడం వల్ల వచ్చే తీవ్ర పరిణామాలు:
- రక్తనాళ వ్యాధి వల్ల గుండెపోటు, స్ట్రోక్ కి దారితీస్తుంది.
- కంటి సమస్యలు
- చర్మ సమస్యలు
- నరాల వ్యాధి
- మూత్ర పిండాల సమస్యలు
- ప్రతి రోజు 45 నిమిషాల వ్యాయామం
- బరువు సమతుల్యం
- మాత్రలు సమయానికి క్రమం తప్పకుండ వాడటం
- ప్రతిరోజూ నిర్ణీత సమయానికి భోజనం చేయడం
- మడుమేహంలో కాళ్ళ పదాల స్పర్శ కోల్పోయే అవకాశాలు ఎక్కువ, కాబట్టి ప్రతి సంవత్సరం పాదాల స్పర్శ ఎలా ఉందో చూసుకోవాలి.
- పాదాలకు, కాళ్ళకు చర్మం కందిపోవడం కానీ ,గాయాలు కానీ, ఆనెలు కానీ అయినప్పుడు కచ్చితంగా డాక్టర్ ని సంప్రదించి వైధ్యం చేసుకోవాలి. సొంత వైద్యం జోలికి మాత్రం పోరాదు.
- శరీరానికి ఎలాంటి గాయాలు కాకుండా చూసుకోండి.
- అధిక రక్తపోటు, కిడ్నీ, కొలెస్ట్రాల్, కళ్ళు పరీక్షలు డాక్టర్ సలహా మెరకు అప్పుడప్పుడు చేసుకోవాలి.
- మధుమేహం ఉన్నవారికి కిడ్నీ సమస్యలు అధికంగా ఉంటాయి. మూత్రపిండాలు దెబ్బతినే అవకాశం ఎక్కువ. కాబట్టి ప్రతీ మూడు మాసాలకు, ఆరు మాసాలకి మూత్ర పరీక్ష చేసుకొని మూత్రంలో అల్బుమిన్ అనే ప్రోటీన్ విడుదల అవుతుందేమో అని చూసుకోవాలి.
- మధుమేహం ఉన్నవారికి కరొనరీ రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంది. ఈ నాళాలు గుండెకు రక్తాన్ని తీసుకెళ్తాయి.ఇవి మూసుకుపోవడం ద్వారా గుండె నొప్పి వస్తుంది. కాబట్టి గుండె నొప్పి వున్నా లేకున్నా ప్రతీ సంవత్సరం ఈసిజి, ట్రెడ్మిల్ పరీక్షలు చేసుకోవాలి. అలాగే కొలెస్ట్రాల్ ఎలా ఉందో తెలుసుకునే లిపిడ్ ప్రొఫైల్ పరీక్షలు చేసుకోవాలి.
- ధాన్యాలు, పిండిపదార్థాలు తగ్గించి పీచుపదార్థాలు అధికంగా ఉండే కూరగాయలు తీసుకోవాలి. ముఖ్యంగా జామపండు. చేయకూడనివి?
- తీపి పదార్థాలు మానుకోవాలి, నూనె పదార్థాలు తగ్గించాలి.
- పాదరక్షలు లేకుండా నడవకూడదు.
- పొగ తాగడం, మద్యం సేవించడం మానుకోవాలి.
- మానసిక ఒత్తిళ్ళు తగ్గించుకోవాలి.
- కొలెస్ట్రాల్ అధికంగా ఉండే కొవ్వు ఉన్న మాంసం, గ్రుడ్లు తినకూడదు.
- జీవన శైలిని మార్చుకోవాలి.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి